OPEARTION POLO
ఆపరేషన్ పోలో
ఆపరేషన్ పోలో అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఈ ప్రక్రియనే ఆపరేషన్ పోలో అంటారు.
నిజాం నవాబు, ఎంఐఎం అధికారులు, ప్రభుత్వ
అధికారులు హైదరాబాద్ సంస్థాన ప్రజలపై ఏ విధంగా పన్నులు విధించారో ప్రజలు ఏ విధంగా బాధించబడ్డారో
మాచిరెడ్డి పల్లి, గుండ్రంపల్లి, బైరాన్ పల్లి మొదలైన సంఘటనలు మనకు తెలియ పరుస్తుంది.
ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ సంస్థానంలో జరిగితే భారత ప్రభుత్వం ఊరుకోదు అనీ సర్దార్
వల్లభాయ్ పటేల్ పార్లమెంటులో ప్రకటించాడు.
హైదరాబాద్ సంస్థానం పాకిస్థాన్లో విలీనం అవుతుండని,నిజాం
వలన ప్రజలు బాడించబడకూడదని భారత ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
అదే యథాతథస్థితి ఒప్పందం.
ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు
·
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఒక అనుబంధ రాజ్యాంగం మాత్రమే ఉంటుంది.
హైదరాబాద్ సంస్థానంను పాకిస్తాన్లలో విలీనం చేయరాదు.
·
భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య యుద్ధం వచ్చినప్పుడు తటస్థంగా ఉండాలి.
స్వాతంత్ర సంగ్రామంలో, సాయుధ పోరాటంలో అరెస్టు అయిన కాంగ్రెస్ స్టేట్ నాయకులను
విడుదల చేయాలి.
·
హైదరాబాదులో భారత కరెన్సీ చెల్లుబాటు అవ్వాలి హైదరాబాద్లో వాక్ సభా స్వాతంత్ర్యాలు
కల్పించాలి. ఒక సంవత్సరంలోపు హైదరాబాద్ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడాలి.
·
యథాతథ స్థితి ఒప్పందంలో చతారి నవాబు
కీలక పాత్ర వహించాడు. ఇతను ఈ ఒప్పందం తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేశాడు.
తర్వాత ప్రధాని మహంది యార్ జాంగ్ అయ్యారు కానీ ఖాసిం రజ్వీ ఒత్తిడి చేయడంతో
లాయక్ అలీ ప్రధానిగా అయ్యాడు.
·
ఈ ఒప్పందాలను సక్రమంగా కొనసాగిస్తే భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంను
భారతదేశంలో విలీనం చేసి ఉండకపోవచ్చు. కానీ ఈ ఒప్పందాలను నిజాం నవాబు అనుసరించలేడు.
అందుచేతనే భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది.
యథాతథస్థితి ఒడంబడిక ఉల్లంఘనలు
నిజాం నవాబు తనపై ఎటువంటి అభియోగాలు రాకుండా
ఉండేందుకు భారత ప్రభుత్వానికి తాను ఒక నమ్మకమైన రాజు గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని
నటిస్తూ ఈ యథాతథ స్థితి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే నిజాం నవాబు మాత్రం
హైదరాబాద్ సంస్థానంను ప్రత్యేక దేశంగా ఉంచాలని అనుకున్నాడు. అన్నట్టుగానే దానికి
తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి ప్రయత్నించాడు. అవి
·
నిజం సేనాపతి అయిన ఇద్రుస్ తో
కలిసి సైనిక విమానాలను కొనడానికి ఫ్రాన్స్,
జకొస్లోవియ దేశాలకు వెళ్ళాడు.
·
హైదరాబాద్ రాజ్యానికి ఆస్ట్రేలియాలోని సిడ్నీ కాటన్ నుండి
అక్రమంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే వాడు. అయితే ఈ అక్రమ రవాణా గురించి భారత
ప్రభుత్వానికి వందేమాతరం రామచంద్రరావు తెలియజేశాడు.
·
భారతీయ కరెన్సీ హైదరాబాద్ సంస్థానంలో చెల్లుబాటు కాదు అని ప్రకటించాడు.
బంగారు ఎగుమతులపై నిషేధం విధించారు.
·
పోర్చుగీసువారు నుండి గోవాను కొనడానికి ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ సహాయం
కోసం ప్రధాని అయిన లాయక్ అలిని పాకిస్థాన్ కి పంపించారు. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి
గులాం మహ్మద్ హైదరాబాద్ ను సందర్శించి 3 శాతం వడ్డీతో 200 మిలియన్ల రూపాయల రుణం పొందారు.
·
నిజాం నవాబు గోల్కొండ, మోతీ మహల్, చాదర్ఘాట్ లలో ఆయుధ కర్మాగారాలను స్థాపించారు.
నిజాం యధాతథ స్థితి నిబంధనలను ఉల్లంఘించినందుకు
భారత ప్రభుత్వం కే మ్ మున్షీని
సంప్రదింపులకు పంపింది. కె ఎం మున్షీ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని అది ఆలస్యం
అయితే వెంటనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
హైదరాబాద్ సంస్థానం పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవడం
నిబంధన ఉల్లంఘన అని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధాని అయిన లాయక్ అలీ తమ దేశం
స్వతంత్ర దేశం అని ఆయుధాలను సమకూర్చుకుంది హక్కు తమకు ఉందని పేర్కొన్నాడు.
ఖాసిం రజ్వీ మేము అవసరం అయితే మా జెండాను ఎర్రకోట పై ఎగురవేస్తామని చెప్పాడు.మున్షీ
ఆఖరి హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. దీంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో
చేపట్టడం అనివార్యం అయ్యింది.
యధాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నిజాం నవాబు
లొంగ తీయడం ఒకటే మార్గమని భారత్ భావించింది.భారత ప్రభుత్వ సేనలను ఆపడానికి భారత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలు చేపట్టి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా
యుద్ధాలు చేయడానికి వివిధ దేశాల మద్దతు కోరుతూ లేఖలు రాశారు. అవి
·
బ్రిటిష్ చక్రవర్తి – 6 వ జార్జి
·
బ్రిటిష్ ప్రధాన మంత్రి - క్లైమేట్ అట్లీ కి
·
బ్రిటీష్ ప్రతిపక్ష నాయకుడు – విన్ స్టన్ చర్చిల్ కి
·
అమెరికా అధ్యక్షుడు - ట్రూమన్ గారికి హైదరాబాద్ సంస్థానానికి మద్దతుగా
లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయింది.
అయితే నిజాం నవాబు హైదరాబాద్ ప్రతినిధిగా మోయిన్ నవాజ్ జంగ్ నీ
ఐక్యరాజ్యసమితిలో భారత దేశముపై ఫిర్యాదు చేయడానికి పంపించాడు. ఐక్యరాజ్యసమితి
హైదరాబాద్ విషయం 1948 సెప్టెంబర్ 17న భద్రతామండలిలో చర్చకు వస్తుందని ప్రకటించింది.
ఆపరేషన్ పోలో (1948 సెప్టెంబర్ 13 – 17)
· హైదరాబాదుపై పోలీసు చర్యకు లెఫ్ట్ నెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వం వహించాడు. షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి (J.N చౌదరి), విజయవాడ నుండి జనరల్ రుద్ర నేతృత్వంలో యూనియన్ సైన్యాలు దాడికి సిద్ధం అయ్యాయి.
·
భారత సైన్యాలు తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే ప్రజలు సంతోషంతో
ఘనస్వాగతం పలికారు. కేవలం నాలుగు రోజుల కాలంలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్
జె.ఎన్.చౌదరి సైన్యాలు ప్రవేశించాయి.
·
సెప్టెంబర్ 17న లాయక్ అలీ రాజీనామా చేసి ప్రభుత్వను నిజాంకి అప్పగించింది. చివరికి
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక యుద్ధం చేయాలేనని భావించి సెప్టెంబర్ 17న తన
అధికారిక రేడియో(దక్కన్) లో
లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. దానితో పాటు జైల్లో ఉన్న రామానంద తీర్థను విడుదల
చేయాలని ఆజ్ఞాపించాడు.
·
1948 సెప్టెంబర్ 18న నిజాము సైన్యాధిపతి జనరల్ ఎల్డ్రస్(ఇడ్రుస్)
చౌదరి ముందు లొంగి పోవడం జరిగింది. మిలటరీ నియామకాల ప్రకారం హైదరాబాద్ను
మొదట చేరుకుంది చౌదరి కాబట్టి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
·
హైదరాబాద్ రాజ్యంపై మిలటరీ గవర్నర్ గా చౌదరీ నియమితులయినప్పటికీ రాజ్యధినేతగా
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు.
·
నిజాము నవాబు 1948 సెప్టెంబర్ 22న భారత దేశంపై చేసిన ఫిర్యాదును
వెనక్కి తీసుకున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భరత్ భద్రతా మండలికి తెలియజేశాడు. ఈ చర్యకి
రాజాజీ పోలీస్ యాక్షన్ అనే పేరు సూచించాడు.
·
ఈ పోలీసు యాక్షన్ సమయంలో జనరల్ భూచర్
భారత సైన్యాధిపతిగా, బల్ దేవ్ సింగ్ భారత రక్షణ మంత్రిగా ఉన్నారు.
·
ఈ ఆపరేషన్ పోలో అనంతరం సర్దార్ వల్లభాయ్
పటేల్ మాట్లాడుతూ ఈ చర్య వలన భారతదేశ కడుపులో ఏర్పాటు పుండు తోలగిపోయిందని
పేర్కొన్నారు.
·
1948 సెప్టెంబర్ 18న నిజాము నవాబు చౌదరినీ కలిసి లాంఛనంగా అధికారం అప్పగించారు.
అదేరోజు లాయక్ అలీనీ, సైన్యాధికారి అయిన జనరల్ ఇడ్రుస్ ను భారత సైన్యం గృహనిర్భందం
చేసింది. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీనీ బొల్లారంలో నిర్బంధించారు.
·
పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్
ను బెగంపెట్ విమానాశ్రయం వద్ద మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఘన స్వాగతం పలికారు.
No comments:
Post a Comment